NLR: వేసవి సెలవుల్లో పిల్లలు ప్రమాదాలకు గురి కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వింజమూరు ఎంపీడీవో కే. శ్రీనివాసులు రెడ్డి మంగళవారం సూచించారు. చిన్నారులు సరదాగా చెరువులు, వాగులు, వంకల్లో ఈత కొట్టాలని ప్రయత్నిస్తారని అన్నారు. నీటి వనరుల లోతును, ప్రమాద స్థాయిని అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్న ఘటనలున్నాయని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.