అన్నమయ్య: హైవేపై ముందు వెళుతున్న డీజిల్ ట్యాంకర్ను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం వాల్మీకిపురం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వాల్మీకిపురానికి చెందిన ఓ కారు డ్రైవర్ కలికిరి వైపు బయలుదేరాడు. కారు మార్గమధ్యంలోని కలికిరి సమీపంలో ఉన్న టోల్ ప్లాజా వద్దకు రాగానే ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను అదుపుతప్పి ఢీకొట్టాడు.