టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్‌పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ వద్ద పలువురు అభిమానులు వారితో ఫోటోలు దిగారు.
ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్(Rishabh Pant), అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి వీఐపీల విరామసమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో పంత్, అక్షర్ కు వేద పండితుల వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. భారత క్రికెటర్లకు టిటిడి అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేయడం చేశారు. ఆలయం వెలుపల వచ్చిన రిషబ్ పంత్, అక్షర్ పటేల్ (Akshar Patel) తో భక్తులు, అభిమానులు సెల్పీలు దిగారు.
ఘోర కారు ప్రమాదం నుంచి బయటపడిన రిషబ్ పంత్.. ఇటీవల కోలుకున్నాడు. మళ్లీ క్రికెట్ గ్రౌండ్ లోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాడు. గురువారం శ్రీవారిని భక్తులు 59,335 దర్శించుకున్నారు.నిన్న (గురువారం) శ్రీవారి హుండీ ఆదాయం (Hundi income) రూ.3.29 కోట్లు వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.