KMR: కామారెడ్డి పట్టణంతో పాటు సరంపల్లి, పాతరాజంపేట, చిన్నమల్లారెడ్డి గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఎండ వేడిమి నుంచి జనం ఉపశమనం పొందారు. అయితే, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరబోసిన ధాన్యం తడిసిపోకుండా చూడాడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు.