»Virat Kohli Chase To Equal Sachins Record 49 Odi Centuries Record
Sachin tendulkar: రికార్డు సమం చేసేందుకు కోహ్లీ ఛేజ్..కానీ
ఈరోజు వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ ఛేజ్ చేస్తాడని అనుకుంటే..అది పూర్తి కాకుండానే ఔట్ అయ్యారు. శ్రీలంకతో జరిగిన ఇన్నింగ్స్‌లో టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డును విరాట్ సమం చేయాలని అభిమానులు ఆత్రుతగా చూడగా అది ఈరోజు సఫలం కాలేదు.
virat Kohli chase to equal Sachin's record 49 odi centuries record
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో 33వ మ్యాచులో టీమిండియా నేడు శ్రీలంకతో తలపడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్(sachin tendulkar) ఆల్ టైమ్ రికార్డును విరాట్ కోహ్లీ ఈ ఆటలో సమం చేయాలనుకున్న ప్రయత్నం విఫలమైంది. మధుశంక బౌలింగ్‌లో కోహ్లి కవర్ వైపు డ్రైవ్ చేయగా..ఆ క్రమంలోనే క్యాచ్ పట్టారు. దీంతో విరాట్ 88 పరుగులకే వెనుదిరిగాడు. అంతకుముందు 92 రన్స్ వద్ద గిల్(Shubman Gill) అవుట్ కావడం విశేషం. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగుల తేడాతో ఔటైన విరాట్ రికార్డును ఈసారి కూడా చేయలేకపోయారు.
విరాట్ కోహ్లీ(virat kohli) సెంచరీ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ సార్లు వన్డేల్లో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు విరాట్ సాధించాడు. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులకు చేరుకున్న కోహ్లీ 1000 పరుగులను అధిగమించాడు. కోహ్లి ఈ ఘనతను 8 సార్లు సాధించగా, టెండూల్కర్ తన అద్భుతమైన వన్డే కెరీర్లో ఏడు సందర్భాలలో ఈ ఘనత సాధించాడు.
34 ఏళ్ల కోహ్లీ ప్రస్తుతం గొప్ప ఫామ్‌లో ఉన్నాడనడంలో అస్సలు సందేహం లేదు. అతను ఈ ప్రపంచ కప్‌లో మైదానంలోకి దిగిన ప్రతిసారీ భారీ స్కోర్‌ను సాధించేలా చూసుకుంటున్నాడు. అతను ఈ సంవత్సరం మెగా ఈవెంట్లో ఇప్పటికే 400 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో అతని రికార్డు 49వ వన్డే సెంచరీ కూడా బద్దలు కొట్టాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతని రికార్డుకు తిరిగి వస్తే ఈ సంవత్సరం కాకుండా విరాట్ కోహ్లీ(kohli) ఒక క్యాలెండర్ ఇయర్లో 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019లో 1000 పరుగులు పూర్తి చేశాడు.