NGKL: శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ రోజురోజుకు పెరిగి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తుక్కుగూడ నుంచి కల్వకుర్తి వరకు ఆరు లైన్ల రహదారిగా విస్తరణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని మంగళవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు.