GDWL: జూరాల, ర్యాలంపాడు వంటి ప్రాజెక్టులు జిల్లా రైతులకు ఎంతో ముఖ్యమని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. మంగళవారం ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి ధరూర్ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, సమాంతర కాలువలు, జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు.సాగునీటి ప్రాజెక్టులే జిల్లాకు జీవనాధారమని, వాటి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదన్నారు.