MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో సర్వే నంబర్ 221లో వెంచర్ నిర్మాణంపై మోసం ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధాన రహదారి లేకుండానే MUDA అనుమతులు పొందిన యాజమాన్యం ప్లాట్లు విక్రయిస్తూ అమాయకులను మోసం చేస్తోందని సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి అనుమతులు రద్దు చేయాలని కోరారు.