TG: భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌లో దారుణ ఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇద్దరు 14 ఏళ్ల బాలురు కలిసి ఈనెల 22న ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారికి భూపాలపల్లి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.