BHPL: చిట్యాల మండలం, నైన్ పాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గొడుగు విజేందర్ తండ్రి కాశీం ఇటీవల మరణించాడు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మంగళవారం వారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.