TPT: వేసవిలో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని తిరుపతి కమిషనర్ ఎన్.మౌర్య పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. ఓఆర్ఎస్ పాకెట్లను పంపిణీ చేసి వాటిని సరిగ్గా వినియోగించుకోవాలని అన్నారు. ఎండలో ఎక్కువసేపు పని చేయకుండా సమయాల్లో మార్పులు చేశామని తెలిపారు. అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలని, అస్వస్థత ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.