CTR: కుప్పం మండల పరిధిలోని మంకలదొడ్డిలో సీఎం సతీమణి భువనేశ్వరి పర్యటించారు. మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే వారి కుటుంబాలు బాగుంటాయని, మహిళలు ఆర్థికంగా ఎదగేందుకు స్వయం ఉపాధి ఎంతో అవసరమని సూచించారు. దానికి కావాల్సిన సహకారం ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు.