తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు బైరాగిపట్టెడలోని MGM హై స్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగం, సిగ్నల్స్ పాటించడం, జీబ్రా క్రాసింగ్ ప్రాముఖ్యతపై వివరించడంతో పాటు మహిళల స్వీయ రక్షణపై కూడా సూచనలు ఇచ్చారు.