NLG: చింతపల్లి మండలం మాల్ పట్టణంలో మంగళవారం సివిల్ సప్లై అధికారులు హోటల్స్, బేకరీలు, చికెన్ సెంటర్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు కేటాయించిన డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించి 40 సిలిండర్లను సీజ్ చేశారు. నిబంధనలు అందించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.