MBNR: జిల్లా కేంద్రంలోని ఫుట్ పాత్ ఆక్రమణల వల్ల పాదచారులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఓ ఆర్గనైజేషన్ నిర్వాహకులు సారంగి లక్ష్మీకాంత్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశారు. గతంలో వీధి వ్యాపారుల కోసం కేటాయించిన షెల్టర్లు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. దీంతో అధికారులు స్పందించి వాటిని వెంటనే పునరుద్ధరించి ఆక్రమణలు తొలగించాలని కోరారు.