SKLM: ఎస్సీ కమిషన్ 59 ఉప కులాలకు ఒక రక్షణ కవచం లాంటిదని రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు రావాడ సీతారాం అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమీషన్ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకొని ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు పేర్కొన్నారు.