మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఉపాసన నానమ్మ కన్నుమూశారు. తన నానమ్మ తుదిశ్వాస విడిచిన విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన నానమ్మ చివరి వరకూ ఎంతో ప్రేమ, గౌరవంతో నిండిన జీవితాన్ని గడిపారని, జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో ఆమె ద్వారానే తెలుసుకున్నానన్నారు. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తించుకునే ఉంటానన్నారు. తన నానమ్మ నుంచి ఎలాంటి అనుభూతులు పొందానో తన పిల్లలకు కూడా వాటిని అందిస్తానని తెలిపారు. నానమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు తెలిపారు.