KNR: సైదాపూర్ మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు తాటిచెట్టుపై నుంచి కిందపడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన ఆకుల వేణు ఉదయం తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడడంతో వెన్నుపూసతో పాటు, పలు చోట్ల తీవ్రగాయాలు అయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.