KDP: ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా బద్వేల్లో ఆరోగ్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి నరసింహారెడ్డి, హెల్త్ శివరామి రెడ్డి క్షయ వ్యాధి లక్షణాలు, జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. దగ్గు 2 – 3 వారాలకంటే ఎక్కువ సాగితే, దగ్గుతో రక్తం లేదా కఫం రావడం, ఛాతి నొప్పి వంటి లక్షణాలను గమనించవలసినట్లు సూచించారు.