KRNL: మంత్రాలయంలో UTF ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం నియోజకవర్గస్థాయి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కౌలన్న, చంద్రపాల్ మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు చెల్లించాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, మెమో 57 అమలు చేయాలని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.