ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈనెల 31న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ జాబ్ మేళా ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైనా వారికీ నెలకు రూ. 18-20 వేల వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలన్నారు.