AP: తెలుగు రాష్ట్రాల్లో RDT సేవలు యథాతథంగా కొనసాగుతాయని మంత్రి లోకేష్ వెల్లడించారు. కేంద్రంతో జరిపిన సంప్రదింపులతో అడ్డంకులు తొలగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఉపాధి, వైద్యం, ఆర్థిక సాధికారతలో సంస్థ చేస్తున్న కృషిని కేంద్రానికి వివరించానని, సహకరించిన ప్రధాని, హోంమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.