అమెరికన్ సింగర్, బ్లూగ్రాస్, కంట్రీ మ్యూజిక్ లెజెండ్ రోనీ బోమాన్ (64) కన్నుమూశాడు. మార్చి 22న టేనస్సీలో జరిగిన బైక్ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ‘ది లోన్సమ్ రివర్ బ్యాండ్’ మాజీ సభ్యుడైన ఆయన, మూడుసార్లు IBMA ‘మేల్ వోకలిస్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు అందుకున్నాడు. గాయకుడిగా, పాట రచయితగా సంగీత ప్రపంచంలో అతను చెరగని ముద్రవేశాడు.