GNTR: గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 25న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాకు 10వ తరగతి నుంచి బీటెక్, ఫార్మసీ వరకు చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.