MDCL: ఉప్పల్ పరిధిలో దోమల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది. గణేష్ నగర్, సెవెన్ హిల్స్, కావేరి నగర్ ప్రాంతాల్లో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వ నీరు, డ్రైనేజ్ సమస్యలు, చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు విస్తరిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అధికారులు వెంటనే ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు చేపట్టి శుభ్రత నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.