GNTR: పోలీస్ పిల్లలకు తులసి సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం గుంటూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్, డిగ్రీ, పీజీ స్థాయిలలో 80 శాతం పైగా మార్కులు సాధించిన 120 మంది విద్యార్థులకు మొత్తం రూ.5.28 లక్షల స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తులసి సీడ్స్ సంస్థ ఛైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పాల్గొన్నారు.