GDWL: అయిజ మండల కేంద్రంలో విద్యార్థుల కోసం వసతి గృహాలను ఏర్పాటు చేయాలని BRSU జిల్లా కన్వీనర్ కురువ పల్లయ్య డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు వినతిపత్రం సమర్పించారు. 70 గ్రామాలకు కేంద్రమైన అయిజలో వసతి సౌకర్యం లేక విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని, తక్షణమే హాస్టళ్లు నిర్మించాలని ఆయన కోరారు.