W.G: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆకివీడులో సోమవారం రాత్రి DYFI ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. దొరగారి చెరువు నుంచి ఎస్ టర్నింగ్ వరకు జాతీయ రహదారి గుండా ఈ ర్యాలీ సాగింది. అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డోకల రవితేజ, బొడ్డుపల్లి రాంబాబు, బివీ వర్మ, పెంకి అప్పారావు పాల్గొన్నారు.