NLG: ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా స్వయం ఉపాధి పొందే ఎస్సీ యువతకు 70-90% సబ్సిడీపై ఈవీ టూవీలర్లు, ఆటోలు, సోలార్ పంపుసెట్లను ప్రభుత్వం అందిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 929 యూనిట్లకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అర్హులు ఈనెల 24 లోగా tgobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈవీ వాహనాలకు అప్లై చేసుకునే వారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.