జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బీ. రాజ గౌడ్ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయ సంస్థ సమావేశం జరిగింది. 2025-26 నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో 8% గ్రంథాలయ పన్ను బకాయిలను సమయానికి చెల్లించడానికి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, గ్రంథాలయ సంస్థ సిబ్బంది సమన్వయం చేసుకోవాలని సూచించారు.