KRNL: బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు విజయభాస్కర్ రెడ్డి, వీరేష్, హుస్సేన్ సాని, శ్రీధర్ సింగ్ తెలిపారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు. పోలింగ్ అనంతరం ఎన్నికల ఫలితాలను లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.