AP: అమరావతిలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాయపూడి సమీపంలో పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిర్మాణం కోసం నిల్వఉంచిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రూ.8 కోట్ల విలువైన పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. కాగా, 12 రోజుల క్రితం నేలపాడులోనూ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.