»Makhana Order In Flipkart Company Reaction To Insects In Them
Flipkart:లో మఖానా ఆర్డర్..వాటిలో పురుగులపై కంపెనీ రియాక్ట్
మఖానా(Makhana) ఈ ఫుడ్ గురించి దాదాపు అనేక మందికి తెలిసే ఉంటుంది. దీనిని ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతారు. ప్రధానంగా పిల్లలకు ఎక్కువగా పెట్టేందుకు ఇష్టపడతారు. అయితే ఇటివల ఓ వ్యక్తి ఫ్లిప్ కార్టులో మఖానా ఆర్డర్ చేయగా..అందులో పురుగులు వచ్చాయి. దీంతో అతను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చుద్దాం.
Makhana order in Flipkart Company reaction to insects in them
ఒక వ్యక్తి తాను ఆన్లైన్లో ఫ్లిప్ కార్ట్(Flipkart) నుంచి ఆర్డర్ చేసిన మఖానా(Makhana) ప్యాకెట్లో చిన్న చిన్న పురుగులు ఉన్నాయని X వేదికగా షేర్ చేశాడు. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేసిన తర్వాత, అతను తన ట్వీట్లో కంపెనీతోపాటు ఆర్డర్ వివరాలను పేర్కొన్నాడు. అంతేకాదు అందుకు సంబంధించిన చిత్రాలను సైతం పంచుకున్నాడు. దీనికి రిటర్న్ పాలసీ లేదని వినియోగదారు సిద్ధార్థ్ షా గుర్తుచేశారు. అతను పంచుకున్న చిత్రాలలో మఖానా లోపల ముక్కలలో చిన్న కీటకాలు కనిపిస్తున్నాయి.
Order ID – OD429472725192584100
I ordered Farmley Premium Phool Makhana from #Flipkart. When I opened the package, I saw live bugs and little insects. It’s horrible to go through this. Furthermore, there is no return policy for the product. pic.twitter.com/2T9q5GWBoD
అయితే అతని పోస్ట్‌కి ఫ్లిప్‌కార్ట్ నుంచి సమాధానం వచ్చింది. X నుంచి ‘ఆర్డర్-నిర్దిష్ట వివరాలను’ తొలగించమని కూడా అతనిని కోరింది. ఆ క్రమంలో కంపెనీ, కస్టమర్ మధ్య సంభాషణ కొంతసేపు కొనసాగింది. చివరికి సిద్ధార్థ్ షా ఇలా వ్రాశారు. Flipkart ఈ ఆర్డర్ ను తిరిగి ఇచ్చిందని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ అక్టోబర్ 25న షేర్ చేయగా.. అప్పటి నుంచి దీనిని దాదాపు 83,000కిపైగా వీక్షించారు. అంతేకాదు ఈ షేర్‌కి 300కి పైగా లైక్‌లు కూడా వచ్చాయి. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.
బ్రో ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆహార ఉత్పత్తులను ఎప్పుడూ ఆర్డర్ చేయవద్దని మరోవ్యక్తి కామెంట్(comments) చేశారు. తనకు కూడా ఇలాగే జరిగిందని, వారు గడువు ముగిసిన వస్తువును పంపారని వెల్లడించారు. వాపసు చేయని ఉత్పత్తుల కోసం సాధారణంగా కంపెనీలు వస్తువును పారవేయమని అడుగుతాయి లేదా వాటిని వాపసును తిరిగి ఇస్తాయి. కాల్ లేదా ఇమెయిల్ వంటి విభిన్న మాధ్యమాల నుంచి వారిని సంప్రదించడానికి ప్రయత్నించండి. మీరు అప్పటికీ వారితో కనెక్ట్ కాలేకపోతే, మీ ఛార్జీని ఇవ్వాలని డిమాండ్ చేయవచ్చని ఇంకో వ్యక్తి వెల్లడించారు.