»England Who Chose To Batting Will Beat Sri Lanka Team Icc World Cup 2023
Eng vs srilanka: బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..లంకను బీట్ చేస్తుందా?
నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య 25వ మ్యాచ్ మొదలైంది. టాస్ గెల్చిన బ్రిటిష్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ జట్టులో ఓ జట్టు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందో ఇప్పుడు చుద్దాం.
England who chose to batting will beat sri lanka team icc world cup 2023
ICC వన్డే ప్రపంచ కప్ 2023లో 4 మ్యాచ్‌లు ఆడి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున 8వ స్థానంలో నిలుస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ జట్టు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచారు. ఈ టోర్నీలో వారి ఏకైక విజయం బంగ్లాదేశ్‌పై (137 పరుగుల తేడాతో) సాధించింది. ఆ తర్వాత న్యూజిలాండ్ (9 వికెట్ల తేడాతో), ఆఫ్ఘనిస్థాన్ (69 పరుగులతో), దక్షిణాఫ్రికా (229 పరుగులతో) చేతిలో ఓడిపోయింది. మరోవైపు శ్రీలంక జట్టుది కూడా ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒకదానిలో మాత్రమే విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో (102 పరుగులతో), పాకిస్థాన్‌తో (6 వికెట్లతో), ఆస్ట్రేలియాతో (5 వికెట్లతో) ఓడిపోయింది. ఇక వారి మునుపటి మ్యాచ్‌లో(నెదర్లాండ్స్‌పై) 5 వికెట్ల తేడాతో గెలిచారు.
ఈ రెండు జట్లు గతంలో ఒకరితో ఒకరు 78 మ్యాచ్‌లు ఆడారు. గెలుపు కూడా దాదాపు సమానంగా ఉంది. ఇందులో ఇంగ్లాండ్ 38 మ్యాచ్‌లు విజయం సాధించగా, శ్రీలంక 36 మ్యాచ్‌లు గెలిచింది. 3 మ్యాచ్‌ల్లో ఫలితాలు రాలేదు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇక ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఒకదానితో ఒకటి తలపడగా ఇంగ్లాండ్ 6, శ్రీలంక 5 గెలిచాయి. ఇంగ్లాండ్, శ్రీలంక 2019 ప్రపంచ కప్ మ్యాచ్‌లో చివరిసారి తలపడ్డాయి.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో ఎవరో గెలుస్తారో చూడాలి. టాస్ గెల్చిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ పీచ్ స్పైన్ బౌలర్లు, పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ బ్యాటర్లు తరచుగా బౌండరీలను సద్వినియోగం చేసుకుంటారని అంటున్నారు. మరోవైపు గూగుల్ గెలుపు సంభావ్యత ప్రకారం ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు గెలిచే అవకాశం 74% ఉందని అంచనా వేసింది.