ఈ దేశం, ఆ దేశం అని కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ బద్దలు చేసేందుకు వచ్చేస్తోంది అవతార్ 2. సినీ ప్రియుల్ని ఓ సరికొత్తలోకంలో తీసుకెళ్లిన ‘అవతార్’ మూవీకి సీక్వెల్‌గా ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ రాబోతోంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టిని మరోసారి చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. ఈ ఏడాది డిసెంబరు 16న అవతార్ 2ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అంతకు ముందే మరోసారి అవతార్ సినిమాను హై రెజల్యూషన్‌తో సెప్టెంబర్ 23న రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దాంతో అవతార్ 2కు మరింత హైప్ రావడమే కాదు.. అంతకుముందు అవతార్ సినిమాను మిస్ అయిన వారు మళ్లీ చూసే అవకాశముంటుంది. ఇక అవతార్ రిలీజ్ అయి 13 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే అవతార్ సీక్వెల్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తన్నారు. ఇక ఆ సమయం రానే వచ్చేస్తోంది.. అవతార్ 2 థియేటర్లోకి రావడానికి జస్ట్ 100 రోజులు మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు అవతార్ మేకర్స్. ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ను వందరోజుల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం.. అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. వింత జీవితో ఉన్న ఆ పోస్టర్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తోంది. దాంతో పండోరా గ్రహం పై అద్భుతం జరగబోతోందని చెప్పొచ్చు. మరి జేమ్స్ కామెరూన్.. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.