యుద్ధం కారణంగా గాజా ప్రాంతంలో 1000 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ దాదాపు 5500 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధంలో ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారు. ఈ యుద్ధం వల్ల ఇప్పటి వరకూ దాదాపు 5500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. ఈ యుద్ధంలో గాజా (Gaza)లో పెద్ద సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడ్డారు. గాజాలోని 23 లక్షల జనాభాలో చాలా మంది 18 ఏళ్లలోపు వారే ఉండగా యుద్ధం (War) కారణంగా ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి బలైపోతున్నట్లు పాలస్తీనియన్ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది.
గాజా (Gaza)లో నిత్యం 100 మంది చనిపోతున్నారని, యుద్ధం కారణంగా అభంశుభం తెలియని చిన్నారులు (Childrens) ప్రాణాలు విడుస్తున్నారని ఆ సంస్థ వెల్లడించింది. అక్టోబర్ 7వ తేదిన ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం ప్రారంభం కాగా ఇప్పటి వరకూ గాజాలో 3,400 మంది చనిపోయారు. వారిలో 1000 మంది వరకూ చిన్నారులే ఉన్నాట్లుగా ఆ సంస్థ అంచనా వేసింది. ఈ యుద్ధం కారణంగా ప్రతి ముగ్గురు మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లుగా ఆ సంస్థ తేల్చింది.
యుద్ధం (War) కారణంగా గాజాలో నరమేధం జరుగుతోందని డిఫెన్స్ ఫర్ చిల్ట్రన్ ఇంటర్నేషనల్-పాలస్తీనా (DCIP) అధికార ప్రతినిధి వెల్లడించారు. గాజాతో పోలిస్తే ఇజ్రాయెల్లో ప్రాణ నష్టం తక్కువగా జరిగిందని, హమాస్ దాడుల వల్ల ఇజ్రాయెల్ ప్రాంతంలో ఇప్పటి వరకూ 1400 మంది మృతిచెందినట్లు ఆ సర్కార్ వెల్లడించింది. వారిలో కూడా 14 మంది చిన్నారులే ఉన్నట్లు నివేదించింది.