»Indias Great Victory In The Thrilling Battle Kohlis Century Misses
IND vs NZ: ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం..కోహ్లీ సెంచరీ మిస్
ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది. కోహ్లీ 95 పరుగులతో సెంచరీ మిస్ చేయడంతో అభిమానులు నిరాశ చెందారు.
నేటి వన్డే వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీణ 50 ఓవర్లలో ఆలౌట్ అయ్యి 273 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత జట్టు 274 పరుగులు చేసి విజయం సాధించింది. న్యూజిలాండ్ (New Zealand) బ్యాటర్లలో డెరిల్ మిచెల్ 130, రచిన్ రవీంద్ర 75 పరుగులు చేసి స్కోరును ముందుకు కదిలించారు.
న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ (Mahammed Shami) 5 వికెట్లు పడగొట్టాడు. భారత క్రికెటర్లలో వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 32 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. మరో వైపు టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో 2000 పరుగులు చేసి దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ 38 సిక్సర్లు కొట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు.
భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 95 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అలాగే రోహిత్ శర్మ కూడా హాఫ్ సెంచర్ మిస్ అయ్యాడు. 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇకపోతే జడేజా 39, శ్రేయస్ అయ్యర్ 33, గిల్ 26, కెఎల్ రాహుల్ 27 పరుగులు చేశారు. ఆఖర్లో జడేజా ఫోర్ కొట్టి విన్నింగ్ షాట్ ఆడాడు. భారత్ 48 ఓవర్లలో 274 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టీమిండియా మొదటి స్థానంలోకి చేరింది.