‘ధురంధర్-2’ చిత్రాన్ని రాజకీయ వివాదాలు చుట్టుముట్టాయి. ఈ మూవీని తమిళనాడులో తక్షణమే నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ అడ్వకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాలో అభ్యంతరకర రాజకీయ అంశాలు ఉన్నాయని, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ చిత్రాన్ని ప్రదర్శించకపోవడమే ఉత్తమమని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.