10 కిలోల ఎల్పీజీ సిలిండర్లను కేంద్రం పంపిణీ చేస్తుందని వస్తున్న వార్తలను పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఖండించారు. ఎల్పీజీ సిలిండర్ బరువును 14.2 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టిపారేశారు.