కృష్ణా: ఉయ్యూరు-కాడూరు రోడ్డులో సాయిరాం డెంటల్ కేర్ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉయ్యూరు పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, వైద్యరంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలని ఆయన ఆకాంక్షించారు.