VKB: శాంతిభద్రతలను పక్కాగా అమలు చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తామని నవాబుపేట ఎస్సై గిరి తెలిపారు. సోమవారం నవాబుపేట ఎస్సైగా ఆయన బాధ్యతలను చేపట్టారు. శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ నేరాలను అరికట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని ఆయన తెలిపారు.