IPS officer Manoj Sharma gets special tribute from village school
IPS officer Manoj Sharma: IPS ఆఫిసర్ మనోజ్ శర్మ ఇలా అంటే చాలా మందికిి తెలియదు. కానీ 12th ఫెయిల్ మనోజ్ శర్మ అంటే అందరికి తెలుసు. ఆయన జీవిత కథా ఆధారంగా 12th ఫెయిల్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా తాను చదువుకున్న పాఠశాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన చిన్న నాటి జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు. అతని జీవితానికి ప్రేరణ ఇచ్చని ఆ పాఠశాలను చూసిని నెటిజన్లు దాన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. దాంతో ఈ పిక్స్ కాస్త ఆన్లైన్లో వైరల్గా మారాయి.
“మీ పేరు ప్రపంచంలో ఏ మూలనైనా వ్రాయవచ్చు, కానీ మీరు సాధించిన ఘనత మీ గ్రామంలోని పాఠశాల గోడపై వ్రాసినప్పుడే గొప్ప ఆనందం కలుగుతుంది” అని పోస్ట్ చేస్తూ తాను చదువుకున్న పాఠశాలను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టుకు దాదాపు 2.3 లక్షల మంది చూశారు. 6,500 షేర్లు అయ్యాయి. దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. “మీరు దీనికి అర్హులు” అని ఒకరు అంటే “ఇది నిజంగా గర్వకారణం! సార్ మీరు భారతదేశంలోని యువ తరానికి, మీ ప్రాంతంలోని ప్రజలకు ఆదర్శంగా ఉన్నారు. అని మరొకరు రాశారు.