CM Revanth Reddy Secretary Is IPS Officer Shahnawaz Qasim
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీలు, నామినెటేడ్ పోస్టుల్లో ఉన్న వారి రాజీనామాల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్ల బదిలీ చేశారు. ఆ వెంటనే ఐపీఎస్ అధికారికి సీఎం రేవంత్ రెడ్డి ప్రమోషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సెక్రటరీగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసీంను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం షానవాజ్ ఖాసీం హైదరాబాద్ రేంజీగా ఉన్నారు. ఐజీ స్థాయి అధికారి.. ఐపీఎస్ ఆఫీసర్‌ను సెక్రటరీగా నియమించుకున్నారు రేవంత్ ( Revanth).
ఇక షానవాజ్ సీఎం రేవంత్ ( Revanth) కార్యక్రమాలను ఫిక్స్ చేస్తుంటారు. షెడ్యూల్, రూట్ మ్యాప్, ప్రొటెక్షన్ తదితర అంశాలను ఉద్యోగులతో మానిటరింగ్ చేస్తుంటారు. ఓ ఐపీఎస్ అధికారిని సెక్రటరీగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదివరకు ఐఏఎస్ అధికారులు, ఇతరులకు ప్రయారిటీ ఇచ్చేవారు. ప్రభుత్వ విభాగాలపై రేవంత్ రెడ్డి ( Revanth) క్రమంగా పట్టు సాధిస్తున్నారు. ఒక్కో విభాగంలో హెచ్‌వోడీల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేస్తారు. తన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలతో పదవుల పందేరం కొనసాగనుంది.