»Director Sanjeev Reddy Tollywood Directors Open Letter To Cm Revanth Reddy
Director Sanjeev Reddy: సీఎం రేవంత్ రెడ్డికి డైరక్టర్ బహిరంగ లేఖ
సినీ, ప్రజా సమస్యలను తెలుపుతూ, వాటిని త్వరగా పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి డైరెక్టర్ సంజీవ్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా బహిరంగ లేఖ రాశారు.
Director Sanjeev Reddy: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. సీఎం అయిన వెంటనే రేవంత్‌రెడ్డి మహిళలకు మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ప్రజాదర్బార్ కూడా నిర్వహించారు. ఈ రోజు నుంచి రైతుబంధు నిధులను కూడా విడుదల చేస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన యంగ్ డైరక్టర్ సంజీవ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సోషల్ మీడియా ద్వారా బహిరంగ లేఖ రాశారు.
సినీ, ప్రజా సమస్యలను తెలియజేస్తూ వాటిని త్వరగా పరిష్కరించాలనిసీఎం రేవంత్‌రెడ్డికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాడు. తెలంగాణలో సినిమా అవార్డులను, ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను నిర్వహించాలని కోరారు. వీటితోపాటు అర్హులైన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, పాత్రికేయులకు ాపద్ధతి ప్రకారం ఇల్లు లేదా స్థలాలు ఇవ్వాలని పేర్కొన్నారు. సంజీవ్ రెడ్డి తెలుగులో అల్లు శిరీష్‌తో ABCD అనే సినిమా తెరకెక్కించాడు. రాజ్ తరుణ్ హీరోగా ఆహా నా పెళ్లంటా అనే వెబ్ సిరీస్ తెరకెక్కించాడు.