»Nayanatara Its Ok To Give Hundred Crores Nayanatara Wont Do It With Him
Nayanatara: వంద కోట్లు ఇచ్చిన సరే.. అతనితో చేయనన్న నయనతార?
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు కావొస్తున్న కూడా.. నయన తార క్రేజ్ తగ్గలేదు కదా.. మరింత పెరుగుతు వచ్చింది. ఇప్పటికే భారీగా డిమాండ్ చేస్తోంది నయన్. కానీ ఓ హీరో వంద కోట్లు ఇస్తానన్న కూడా చేయనని చెప్పిందట అమ్మడు.
Nayanatara: నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్, టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దుమ్ములేపిన ఈ బ్యూటీ.. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు నయన్, విఘ్నేష్. ప్రస్తుతం సంసార జీవితంతో పాటు.. హీరోయిన్‌గాను దూసుకుపోతోంది. వరుస సినిమాలు చేస్తోంది అమ్మడు. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా నయన తార టాప్ ప్లేస్‌లో ఉంది. ఇటీవలె ఈ ముద్దుగుమ్మ నటించిన బాలీవుడ్ మూవీ జవాన్.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది.
ప్రస్తుతం తమిళ్లో నయన తార చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. అయితే.. భారీ పారితోషికం తీసుకునే నయనతార.. ఓ హీరోతో మాత్రం వంద కోట్లు ఇచ్చిన కూడా నటించనని చెప్పిందట. అసలు.. వంద కోట్ల ఆఫర్‌ను నయన తార రిజెక్ట్ చేసేంత రేంజ్ హీరో ఎవరని అనుకుంటున్నారా? అతనేనండి ట్రోలింగ్ స్టార్ శరవణన్. బిజినెస్ మేన్‌గా బాగా పాపులర్ అయిన అరుళ్ శరవణన్‌ను సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే.. 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా హీరోగా సినిమా చేశాడు.
2022లో ది లెజెండ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అవడమే కాదు.. శరవణన్‌ను ట్రోలింగ్ స్టార్ చేసింది. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా హీరోయిన్గా నటించింది. కానీ ముందుగా నయన తారను తన సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని చాలా ట్రై చేశాడట శరవణన్. ఏకంగా 100 కోట్ల ఆఫర్ చేశాడట. అయినా కూడా నో చెప్పింద నయన్. దీంతో.. 20 కోట్లు పారితోషికం ఊర్వశీని తీసుకున్నట్టు టాక్.