»Rashmika Mandanna Vd Is My Husband Rashmikas Comments Are Viral
Rashmika Mandanna: VDనే నా భర్త.. రష్మిక కామెంట్స్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరగా అనిమల్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే.. తాజాగా రష్మిక ఇచ్చిన రిప్లై మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Rashmika Mandanna: రష్మిక, విజయ్ దేవరకొండ గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన సరే.. క్షణాల్లో వైరల్‌గా మారుతుంటుంది. గీతా గోవిందం సినిమా నుంచి ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ.. ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రష్మిక, రౌడీ హీరో ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ ఇద్దరు మాత్రం ఎక్కడ కూడా ఓపెన్ అవలేదు. సందర్భం వచ్చినప్పుడు మాత్రం మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతున్నారు. అయినా కూడా ఈ జంట పై వచ్చే పుకార్లు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తునే ఉంటుంది. అందుకు తగ్గట్టే.. రష్మిక, విజయ్ చేసే పోస్టులు మరింతగా వైరల్‌గా మారుతుంటాయి. విజయ్‌తో పాటు రష్మిక కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా.. అభిమానులతో చిట్ చాటు చేస్తునే ఉంటుంది. అలాగే వాళ్లు పెట్టే పోస్టులకు కూడా రిప్లే ఇస్తుంటుంది.
తాజాగా ఒక అభిమాని రష్మికకు కాబోయే భర్త ఇలా ఉండాలి? అని ఓ పోస్ట్ పెట్టాడు. ‘రష్మిక మందన్న కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఆమె నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. అందుకే ఆమె భర్త ప్రత్యేకంగా ఉండాలి. ఆమె భర్త VDలా ఉండాలి. నా ఉద్దేశ్యంలో VD అంటే వెరీ డేరింగ్. మేము ఆమెను రాణి అని పిలుస్తాము.. అప్పుడు ఆమె భర్త కూడా రాజులా ఉండాలి.. అంటూ సదరు అభిమాని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దానికి రష్మిక.. ఇది నిజం అని రిప్లె ఇచ్చింది. అంటే.. తనకు కాబోయే భర్త వెరీ డేరింగ్‌గా ఉండాలి అన్నమాట. అయితే.. VD అంటే విజయ్ దేవరకొండ అనుకున్నాం.. అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.