NLG: సాధారణంగా ఏ ఊరి గుడిలో వెలసిన దేవుడికి ఆ ఊరిలోనే పూజలు, ఉత్సవాలు జరగడం ఆనవాయితీ. కానీ, నల్లొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల, కేతేపల్లి మండలం బండపాలెంలో వెలసిన సీతారామచంద్రస్వామి కథే వేరు. రెండు ఊర్ల భక్తిని ముడివేస్తూ.. ఇక్కడి స్వామివారు ‘రెండూళ్ల రామయ్య’గా ప్రసిద్ధి చెందారు. ఈ రెండు గ్రామాల ప్రజల మధ్య శ్రీరాముడు వారధిగా నిలిచారు.