శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హాజరై, వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెంకటరెడ్డి సేవలను స్మరించుకుంటూ, ఆయన సమాజానికి చేసిన సేవలు ఆదర్శప్రాయమని అన్నారు.