NLR: అనంతసాగరం మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వానతో వరి, పత్తి పంటలు నష్టపోయాయి. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రభావిత పొలాలను పరిశీలించారు. సుమారు 2000 ఎకరాల వరి, 350 ఎకరాల పత్తి పంట నష్టం జరిగిందని రైతులు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.