ఓ మహిళ కారుతో యువకుడిని ఢీకొట్టడంతో పాటు దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అంతకుముందు మెయిన్‌రోడ్‌పై బాధిత యువకుడి కారు.. నిందితురాలు ప్రియాంక వాహనం ఢీకొట్టుకున్నాయి. దీంతో కారు దిగి మహిళను నిలదీసేందుకు బాధితుడు ప్రయత్నించాడు. ఒక్కసారిగా అవేశానికి లోలైన ప్రియాంక.. అతడ్ని కారుతో ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి.. కారు బ్యానెట్‌ను పట్టుకున్నాడు. అయితే ఆమె దాదాపు కిలో మీటర్ వరకు అతడ్ని అలానే బ్యానెట్‌పై ఈడ్చుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు కారును ఆపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Bengaluru police has registered 307 case in a case of negligent and rash driving against a lady named Priyanka. She had dragged Darshan for almost a km who was hanging on to the bonnet of her car. They had an altercation over overtaking car. Case also against 4 others.#Karnatakapic.twitter.com/OQW5gukjgK